ఆయుధ ,వాహన పూజలో పాల్గొన్న ఎస్పీ దంపతులు….
జిల్లా ప్రజలకి దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ రామ్ నాథ్ కేకేన్,
Thovva web news.in//12,oct.sat.1pm

మహబూబాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గ అమ్మవారి పటానికి మరియు శక్తికి రూపమైనటువంటి ఆయుధములకు ఆయుధ కర్మాగారం లో, జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ కుటుంబ సామెతంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయనికి చిహ్నంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పోలీసు వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. జిల్లా పోలీసులుకు , ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపినారు. విజయదశమి ఉత్సవం విజయాలకు ప్రతీకగా అభివర్ణించారు. శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉంటుందని అలాంటి విజయాలను చేకూర్చే విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలన్నారు. పండగను అందరు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలనిఅన్నారు., ముఖ్యంగా నవరాత్రులు పూజలందుకున్న దుర్గ మాత విగ్రహాల నిమజ్జనంను కూడా ప్రశాంత వాతావరణలో నిర్వహించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు , ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఆర్.ఐలు , సీఐలు ఎస్.ఐలు ఆర్.ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు..


