గార్ల నవంబర్ 22 తొవ్వ:తండ్రిని కోల్పోయిన తోటి సీనియర్ ఫోటోగ్రాఫర్ కు మేం ఉన్నామంటూ గార్ల మండల ఫోటో వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్ధిక సహాయం అందించారు.సంతోషాల్లోనే కాదు బాధలో కూడా తోడుంటామంటూ, యూనియన్లో ఎవరికి ఆపద వచ్చిన ముందుండి ఆదుకుంటామని అసోసియేషన్ మండల అధ్యక్షులు బల్లెం దుర్గా ప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాణోత్ శ్రీరామ్, కోశాధికారి రావూరి ప్రశాంత్, జంజీరాళ్ల భాస్కర్, భూక్య రవీందర్, అక్కినపల్లి సతీష్, మూడ్ వీరన్న, యల్లావుల రమేష్, షేక్ ఏజాస్, డికొండ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
తోటి ఫోటోగ్రాఫర్ కు ఆర్ధిక సహాయం

22
Nov