
అధికారికంగా ప్రకటించిన మంత్రి సీతక్క
కొత్తగూడ జనవరి 19 తొవ్వ :మహబూబాద్ జిల్లా ఉమ్మడి కొత్తగూడ మండలం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా సుంకరబోయిన మొగిలి, ఉపాధ్యక్షులుగా కర్ర జనార్ధన్ రెడ్డి ని ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎన్నుకోవడం జరిగింది. వీరితో పాటు 19 మంది కార్యవర్గ సభ్యులను నియమించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మాపై నమ్మకంతో నియమించిన మంత్రి సీతక్క అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.