తొవ్వ మార్చి 9: మోడల్ స్పోర్ట్స్ స్కూల్ 2025-26 విద్యా సంవత్సరమునకు గాను క్రీడా పాఠశాల కొత్తగూడ యందు 5వ తరగతిలో 40 సీట్లు, 7వ తరగతిలో 05 సీట్లు, 8వ తరగతిలో 06 సీట్లు, 9వ తరగతిలో ’06 సీట్లు, 10వ తరగతిలో 10 సీట్లు వాటర్ స్పోర్ట్స్ స్కూల్ బోయినపల్లి యందు 5వ తరగతిలో 10 సీట్లు బాలికలకు,10 సీట్లు బాలురకు ప్రవేశము కొరకు దరఖాస్తులను ఈ నెల 10 నుండి 15 సాయత్రం 5 గంటలలోపు కార్యాలయం ములుగు భూపాలపల్లి జిల్లాల వారు గిరిజన సంక్షేమ శాఖా ఐ.టి.డి.ఏ పీఎంఆర్ సి ఎటురునగారం అదేవిధంగా వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల వారు గిరిజన సంక్షేమ శాఖా, (పి ఎం ఆర్ సి) హన్మకొండ యందు మహబూబాబాద్ జిల్లా వారు గిరిజన సంక్షేమ శాఖా, (పిఎంఆర్ సి) మహబూబాబాద్ మోడల్ క్రీడా పాఠశాల కొత్తగూడ యందు జిల్లాలోని గిరిజన విద్యార్ధుల నుండి దరఖాస్తు స్వీకరించడం జరుగుతుందని ఐ టి డి ఏ పి ఓ చిత్ర మిశ్ర తెలిపారు .అట్టి క్రీడా పాఠశాల కొత్తగూడ యందు ఈ నెల 17 నుండి 20 వరకు జిల్లాల యందు ఎంపికల ప్రక్రియ జరుగును. వరంగల్ ఉమ్మడి జిల్లాల యందు ఎంపిక కాబడిన విద్యార్ధులు ఈనెల 26 నుండి 28 ఉదయం 9.30 సమయం వరకు అట్టి తుది ఎంపిక ప్రక్రియకు హాజరు కావాలని అన్నారు.
మోడల్ స్పోర్ట్స్ పాఠశాలలో అడ్మిషన్స్

10
Mar