ఉత్తమరైటర్ గా భూక్య శ్రీనివాస్
-జిల్లా ఎస్పీ చేతులమీదగా ప్రశంస పత్రం
తొవ్వ,గార్ల ఏప్రిల్17
గార్ల పోలీస్ స్టేషన్లో రైటర్గా తన బాధ్యతలను చాకచక్యంగా నిర్వర్తించి ఉత్తమ రైటర్ గా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ చేతుల మీదుగా భూక్య శ్రీనివాస్ ప్రశంస పత్రాన్ని పొందారు. వృత్తి పట్ల తనకున్న ప్రేమను మండల పోలీస్ అధికారి రియాజ్ పాషా స్టేషన్ సిబ్బంది మండల నాయకులు ప్రముఖులు అభినందించారు ఇలానే వృత్తిపై ప్రేమతో భవిష్యత్తులో మరెన్నో పథకాలను ప్రశంసలను పొందాలని కోరారు
