గంధంపల్లి” సంత లో కుదేలవుతున్న “చిరు వ్యాపారులు”
ఆర్థిక ఇబ్బందులూ తట్టుకోలేం…! చిరు వ్యాపారులు
thovva web news.jan.21.sun
Bayaram special freelance corspandet

గంధంపల్లి సంత చిరు వ్యాపారులకు భారంగా మారిన వైనం..
అయ్యా మమల్ని బతకానీయండి సంత వున్న రోజు మాత్రమే. వచ్చి వ్యాపారం చేసుకొని వెళ్ళిపోతాం..అంటూగంధంపల్లి సంత పరిధిలో అనేక గ్రామాల నుంచి చిరు వ్యాపారులు వచ్చి వ్యాపారం చేస్తూ గంధంపల్లి గ్రామపంచాయతీకి చలానా రుసుములు చెల్లిస్తూ పంచాయతీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా సంత కోసం ప్రత్యేక స్థలం లేకపోవడం తో మెయిన్ రోడ్డు కి ఇరువైపుల రోడ్డుపైన వున్న దుకాణాల ముందు పరచుకొని అమ్ముకోవడం జరుగుతుంది ఈ పరిస్థితుల్లో రోడ్డు కి ఇరువైపుల వున్న శేటర్ల దుకాణాల వ్యాపారుల తమ షాపుల ముందు పెట్టకోవని చిరు వ్యాపారులను నిలదీస్తున్నారు.కొన్ని సందర్భాల్లో దౌర్జన్యం తో చిరు వ్యాపారులపై దూకుడు గా వ్యవహరిస్తున్నారు. అయ్యా బతకడం కోసమే వచ్చామని సాయంత్రం వరకు వుండి అమ్ముకొని పోతామని ప్రాధేయపడినా జాలీ చూపకుండా మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటాం ఎవరూ రావద్దని ఖరాఖండిగా చెబుతున్నారు.ఇకపోతే గంధం పల్లి మెయిన్ రోడ్డు పై వున్న వ్యాపారులు వారి షాపు ఎదురుగా వున్న విస్తీర్ణం కాకుండా నేషనల్ హైవే ని సైతం అక్రమిస్తున్నరు.చిరు వ్యాపారులకు నష్టం కలిగేలా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి సంత ను వేరే చోటికి తరలించి చిరు వ్యాపారులకు న్యాయం చేయాలి అదే విధంగా వ్యాపారులుగా వుండి నిషేధిత దందాలు చేస్తున్న వారు చిరు వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయొద్దని తెలియజేసి సంతపరధిలో ఉన్న చిరు వ్యాపారుల అడ్డాలు స్థలాలు వారి కేటాయించాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.

.