హేమంత్ సోరేన్ అరెస్ట్ చేస్తే …. తెర పైకి కల్పన…
గాండే అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో పోటీకి అవకాశం..
Thovva web news.in 30Jan Tue…

జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా కల్పన సోరేన్ నియమించే అవకాశం ఉన్నట్టు JMM పార్టీ నాయకులు మంగళవారం రాజధాని రాంచీ లో ప్రత్యేక సమావేశంలో వెల్లడించారు ఇటీవల ఇడి వరుసగా మనీ లాండరింగ్ కేసులో హజరు కావాలని నోటీసులు పంపిన హజరు కాలేదు రాంచీ లోను ఢిల్లీ లోను ఆయన ఇంటికి వెళ్లిన లేకపోవడం .. మంగళవారం మధ్యాహ్నం జరిగిన సంకీర్ణ ఎమ్మెల్యే ల సమావేశంలో రాంచీ లోని స్వగృహంలో ప్రత్యక్షం అవడం ఆయన తో పాటు ఆయన భార్య కల్పన సోరేన్ రావడం పార్టీ అంతర్గత సమావేశంలో సోరేన్ అరెస్టు పై చర్చలు జరిగాయి అటు కేంద్రంలోని భాజపా ఈడి తో జతకలిసి అరెస్టు చేయడానికి రంగం సిద్దం చేసినట్టు విశ్వసనీయ సమాచారం అదే జరిగితే వెంటనే కల్పన సోరేన్ కు ముఖ్య మంత్రి పదవీ బాధ్యతలు తీసుకోవడానికి రంగం సిద్దం చేశారు.ప్రస్తుతం కల్పన పార్టీలో ముఖ్య పదవిలో లేకపోవడం ప్రైవేట్ పాఠశాల నడిపిస్తూ సేంద్రియ వ్యవసాయ పై అవగాహన కల్పిస్తున్నారు.ఒకేసారి కల్పన పేరు తెరపైకి రావడం తో పార్టీ లో కుటుంబంలో ఎం జరుగుతుందో అనే సంశయాలు కనిపిస్తున్నాయ్. ఇది ఇలా ఉంటే ఎమ్మెల్యే కాకపోయినా కల్పన పార్టీ అంతర్గతంగా ఇటీవల పట్టు సాధిస్తూ పార్టీని కమెండ్ చేసే స్థాయికి వెళ్ళడం తో పార్టీ. మెజార్టీ ఎమ్మెల్యే లు కల్పన సోరేన్ కు మద్దతు పలుకుతున్నారు . ఇటీవల గాండే అసెంబ్లీ స్థానం కు సర్పరజ్ రాజీనామా చేయడం తో ఆయన స్థానంలో కల్పన నిలబెట్టి గెలిపించాలని పార్టీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం..

కల్పన సోరేన్…
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన కల్పనఇంజినీరింగ్ మాస్టర్స్ చేశారు. ఎంబీఏ పూర్తిచేశారు. పార్టీలో ఆమెను ప్రతి ఒక్కరూఅభిమానిస్తారు.. రాజకీయాల్లో హేమంత్ కు ఆమెముఖ్య విషయాల్లో సలహాలు ఇస్తుంటారనే ప్రచారంఉంది.సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ కు 17 సీట్లు వున్న వారి తోఆమెకు వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు లేవనేచెప్పాలి. ఒకవేళ ఏమైనా విభేదాలు తలెత్తితే అదిఇండియా’ కూటమిపై ప్రతికూల ప్రభావం చూపుతుందనీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో వారు జోక్యం చేసుకోలేరు ఇప్పటికే బీహార్ లోని నితీష్.బెంగాల్ లో దిది ఇండియా కూటమి కి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ఈ సమయంలో JMM తొ పెట్టుకుంటే మరో పార్టీ దూరమవుతారని ఆలోచన తో కాంగ్రెస్ ఎమ్మెల్యే లు కల్పన కు మద్దతు తెలుపుతున్నారు.

కల్పన కు పోటీ ఎవరూ? లేరా?
జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెనక్కు ముగ్గురుకొడుకులు, ఒక కూతురు. శిబు రాజ్యసభ సభ్యుడు.హేమంత్, బసంత్ ఎమ్మెల్యేలు. మరో కుమారుడుదుర్గా 2009లో మరణించారు. ఆయన భార్యప్రస్తుతం ఎమ్మెల్యే. ఆమెకు జేఎంఎం పార్టీవిధానాలు అసలు నచ్చవు. భాజపాతో కలిసిహేమంత్ ప్రభుత్వం అవినీతిపై పోరాడింది. ఈప్రభుత్వాన్ని ఆమె కూలదోస్తుందని 2022 నుంచిప్రచారం జరుగుతోంది. కాకపోతే ప్రస్తుతపరిస్థితుల్లో ఆమెకు అంత రాజకీయ శక్తి లేదని భాజపా జార్ఖండ్ లో సోరేన్ కుటుంబానికి కాకుండా తెర వెనుక వేరే నాయకుణ్ణి తయారు చేయాలని చూస్తుంది. శిభూ మరో కుమారుడు బసంత్కు రాజకీయచతురత లేదని ముఖ్యమంత్రి స్థాయీ కాదని పార్టీ వర్గాలే చెబుతుంటాయి. శిబుకుమార్తె అంజలి రాజకీయాలకు దూరం.గా వున్న నేపథ్యంలో కల్పన రాజకీయ భవిష్యత్తుకు తక్షణమే వచ్చే ప్రమాదం ఏమి లేదని కల్పన జార్ఖండ్ లో కల్పన ముఖ్య మంత్రి కావడం ఖాయమని ప్రజలు చర్చుకుంటున్నారూ
