కొడ్లకండ్ల మండల కార్యకర్తల సమావేశంలో పాలకుర్తి కాంగ్రెస్ ఇన్చార్జి ఝాన్సీ రెడ్డి.
THOVVA WEB NEWS.31.JAN WED.
తొర్రూరు . తొవ్వ న్యూస్.9440589905

పాలకుర్తి నియోజకవర్గన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లి మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని కొడకండ్ల మండల కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మండల స్థాయి ముఖ్య నాయకులతో రివ్యూ మీటింగ్లో ముఖ్యఅతిథిగామాట్లాడుతూ కార్యకర్తలకు,నాయకులకు అభివృద్ధి సంక్షేమపథకాల పై దిశా నిర్దేశం చేశారు. నాయకులందరి సమిష్టి కృషితో పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసామని, కొడకండ్ల మండలలో ఉన్న అన్ని గ్రామాల్లో ప్రధాన సమస్యలను గుర్తించి తమకు తెలియజేయాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు అందరం సమిష్టిగా పని చేయాలన్నారు. ఏ ఒక్కరు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా, లబ్ధిదారులందరకు ప్రజాపాలనలో దరఖాస్తు చేస్తున్న ప్రతి అర్హునికి ఆరు గ్యారెంటీలు అందేలా ప్రతి కార్యకర్త ఒక వాలెంటరిలా పనిచేయాలన్నారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే కాబట్టి, గ్రామాలను అభివృద్ధి పదంలో ముందు ఉంచాలన్నారు. నిరుద్యోగాన్ని తరిమికొట్టడమే ప్రధాన లక్ష్యంగా, తమ సొంత నిధులతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, యువతీ యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నార పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ తమ మీద ఉన్న నమ్మకంతో గెలిపించారాని వారి గెలుపును వమ్ము చేయకుండా పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు..ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండల కార్యకర్తలు పాల్గొన్నారు

