వరి పంటలను పరిశీలించిన వ్యవసాయ విస్తరణ అధికారి…
Thovva web news.// 02 Feb. Friday

నర్సింహుల పేట మండలంలోని లోక్య తండా గ్రామము మరియు నర్సింహులపేట గ్రామము లోని వరి పంటలను ఎ ఇ ఒ రామకృష్ణ పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు దురు నర్సయ్య, దురు వెంకటనర్సు, ఆడెపు వెంకన్న మరియు ఏఈఓ లు పాల్గొన్నారు.ప్రస్తుతం వరి పంటలో కనిపిస్తున్న చీడ పీడలు
**వరిలో*
*ఉల్లికోడు (గొట్టం రోగం )నివారణ :**
1)బైఫెంత్రిన్ (సూపర్ స్టార్ లేదా టాల్ స్టార్ ) 320ml/ఎకరానికి లేదా
క్లోరైపైరిఫోస్ 20% ec 500ml/ఎకరానికి మరియు వేపానూనె 500ml ఒక ఎకరానికి కలిపి పిచికారి చేసుకోవాలి.
ఫై రెండు మందుల్లో ఏదో ఒకదానిని పిచికారీ చేసుకోవాలని సూచించారు.
*2)ఆకుముడత / మొగి పురుగు :* నివారణ చర్యలు.
దీని వలన ఆకులు తెల్లగా మారి లోపలికి ముడుచుకుంటాయి
నివారణ :)బైఫెంత్రిన్ (సూపర్ స్టార్ లేదా టాల్ స్టార్ ) 320ml/ఎకరానికి
2)క్లోరైపైరిఫోస్ 500ml/ఎకరానికి
ఫై రెండు మందుల్లో ఏదో ఒకదానిని పిచికారీ చేసుకోవాలని చెప్పారు.
3. జింకులోప నివారణకు జింక్ సల్ఫేట్ 2 గ్రామ్స్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని
4. వరిలో అగ్గితెగులు
ట్రై సైక్లోజోల్ గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చినారు.