క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నేతలు కార్యకర్తలు….
.27 వార్డులో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్. ఫరీద్ ఆధ్వర్యంలో అన్నదానం..
నియోజకవర్గంలోని పలు మండలాలలో వేడుకలు
Thovva web ,MAY 20, MON
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించారు . ఉదయం నుంచి క్యాంపు కార్యాలయానికి కార్యకర్తల పెద్ద సంఖ్య హాజరై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మధ్యాహ్న సమయంలో కేక్ కట్ చేసి శాలువలు బొకెలు అందించి శుభాకాంక్షలు తెలిపారు తమ నాయకుడు శత సంవత్సరాలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మండల టీ అర్ ఎస్ నాయకులు అశోక్ , ఏలెండర్ వీరన్న శ్రీనివాస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


27 వార్డులో అన్నదానం…
మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్ ఆధ్వర్యంలో 27వ వార్డు లో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి ప్రజలకు పంచి పెట్టారు. అనంతరం కార్యకర్తలు నాయకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
జర్నలిస్టుల సందడి

మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ జన్మదిన వేడుకల్లో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సందడి చేశారు జర్నలిస్టుల నాయకుడు ఆవుల యుగేందర్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హాజరై పుష్పగుచ్చ అందించి శుభాకాంక్షలు తెలిపారు.

నేల్లికుదురులో
ఘనంగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు
మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ జన్మదిన వేడుకలు మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పరిపాటి వెంకటరెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవిలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ దశాబ్ద కాలం పాటు మహబూబాబాద్ నియోజకవర్గంలో తనదైన శైలిలో పేద ప్రజలకు సేవలు అందించిన నేత శంకర్ నాయక్ అని కొనియాడారు. ఆయన జన్మదినం పార్టీ శ్రేణులకు పండుగ లాంటిదని అన్నారు. ప్రజా జీవితంలో మునుముందు మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యసం రమేష్ పటేల్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బత్తిని అనిల్ గౌడ్, ఉపాధ్యక్షులు పులి రామచంద్రు, ప్రధాన కార్యదర్శి వెన్నాకుల శ్రీనివాస్, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షులు కాసం వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ బొజ్జా నాయక్, మాజీ సర్పంచ్ లు గుగులోతు బిక్కు నాయక్, కొమ్ము అనిల్ యాదవ్, జయ మాన్సింగ్, భీముడు, పట్టణ అధ్యక్షులు ఆదిరెడ్డి, బొల్లు మురళి, మంద అశోక్, కారం ప్రశాంత్, సలుగు శ్రీను, ఆయా గ్రామాల నేతలు కార్యకర్తలు తదితరులు ఉన్నారు,