రోడ్డుపై విరిగి పడిన చెట్ల కొమ్మలను తొలగించిన ఎస్ఐ రియాజ్ పాషా
తొవ్వ, గార్ల ఏప్రిల్21
గార్ల నుంచి డోర్నకల్ కు వెళ్లే మార్గంలో ఆదివారం రాత్రి ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి పడి రోడ్డు మీద అడ్డంగా పడి ఉన్నాయి. వాహనాలకు ఇబ్బందిగా మారిన తరుణంలో ఎస్సై ఎస్కే రియాజ్ పాషా తక్షణమే స్పందించి పోలీసు సిబ్బందితో పడిపోయిన చెట్ల కొమ్మలను రాత్రికి రాత్రే తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులకు వాహనదారులు అభినందనలు తెలిపారు.
