కుల సంఘాలు.ఉద్యోగ సంఘాల పూర్తి మద్దతు…
ముఖ్యమంత్రి మద్దతు.తో…ఢిల్లీ ప్రయత్నాలు ముమ్మరం…
Thovva web news . //9398236146
23.జనవరి మంగళవారం.

హరి కోట్ల రవి అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలియనివారు వుండరు.జిల్లా రిజిస్ట్రార్ గా హరి కోట్ల సుపరిచితులు రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న ఆయన వరంగల్ పార్లమెంట్ సీట్ కోసం ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు.గత అసెంబ్లీ ఎన్నికలో స్టేషన్ ఘనపూర్.వర్ధన్నపేట టికెట్లు ఆశించిన కాంగ్రెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన అనివార్య కారణాలతో టికెట్ దక్కలేదు … వరంగల్ పార్లమెంట్ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది దానిలో భాగంగా రాజకీయ భీష్ముడు తెలంగాణ ప్రభుత్వంలో క్రియాశీలక భూమిక పోషిస్తున్న అర్ ఎస్ ఆర్ అండతో ఖమ్మం జిల్లా మంత్రుల సహకారం ఉమ్మడి ఓరుగల్లు నాయకుల మైత్రి…కుల సంఘాలు బలం ఉద్యోగ సంఘాల మద్దతు. తో ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.అందులో భాగంగా తన సొంత సామాజిక వర్గం జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్. ఉద్యోగ సంఘాల నాయకులు టిఎన్జిఓ నేతలతో కలిసి సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం ముఖ్యమంత్రి మద్దతు కూడగట్టేందుకు దావోస్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కలిసే భాగంలో ఆయన సోదరుడు కలిసి శుభాకాంక్షలు చెప్పడం.అంతే కాకుండా రాష్ట్ర జాతీయ నాయకులను కలుస్తుండటం ఢిల్లీ లో తన గాడ్ ఫాదర్ తో సీటు విషయంలో చాపకింద నీరులా ప్రయత్నిస్తుండటంతో వరంగల్ సీటు హరి కోట్ల కే .సానుకూల పవనాలు కనపడుతున్నాయి. దీనికి తోడు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు ఉన్నపటికీ వరంగల్ సీటు విషయానికి వచ్చినప్పటికీ అధినేత మాటకు కట్టుబడి ఉంటామని సీనియర్లు మంత్రులు చెప్పడం తో వర్గపోరు లేదని చెప్పాలి. అంతే కాకుండా” హరి కోట్ల ” టికెట్ ఇస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని నాయకులు ఒకే తాటిపైకి రావడం విశేషం.. ఎది ఏమైనా వరంగల్ పార్లమెంట్ సీటు” హరి కొట్ల”కే అవకాశం ఎక్కువగా వున్నదని ఉమ్మడి జిల్లా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.